info@manadailynews.com
Breaking News

ప్రజా రాజధాని అమరావతికి విరాళాల వెల్లువ

DAS_4145
  • రూ. 1.28 లక్షల విరాళమిచ్చిన ఆటోడ్రైవర్

  • రూ.5 లక్షలు విరాళమిచ్చిన ప్రవాసాంధ్రులు

  • రూ. ౩౦ లక్షల విరాళం అందించిన ఏపీ విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల సహాయ సంస్థ

రాజధాని నిర్మాణానికి రూ. 1,28, 575 విరాళాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఓ ఆటోడ్రైవర్ అందజేశారు. వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును విజయవాడ మాజీ కార్పొరేటర్ పి.శివ సాయి ప్రసాద్ తో కలిసిన సురేష్ ఈ మేరకు చెక్కును సమర్పించారు. రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి పడుతున్న తపన, కృషికి స్పూర్తి పొంది విరాళమిచ్చినట్లు విజయవాడ గుణదలకు చెందిన ఆటోడ్రైవర్ పి. సురేష్ బాబు పేర్కొన్నారు. ఆటో సొంతంగా నడుపుకుంటూ ఒక్కో రూపాయి చేసుకున్న పొదుపు నుంచి ఉదారతతో విరాళమిచ్చారు. రాజధాని నిర్మాణం పట్ల సురేష్ తన భాగస్వామ్యాన్ని, సేవా తత్పరతను చాటుకున్నారని ముఖ్యమంత్రి అభినందించారు. సురేష్ ను స్పూర్తిగా తీసుకుని మరింత మంది ముందుకు వచ్చి రాజధాని నిర్మాణంలో పాలుపంచుకోవాలని సీఎం ఆకాంక్షించారు.

రాజధాని నిర్మాణానికి రూ. 1.28 లక్షల విరాళమిచ్చిన ఆటోడ్రైవర్ సురేష్

రాజధాని నిర్మాణానికి రూ. 1.28 లక్షల విరాళమిచ్చిన ఆటోడ్రైవర్ సురేష్

రూ.5 లక్షలు విరాళమిచ్చిన ప్రవాసాంధ్రులు
అమరావతి నిర్మాణానికి రూ.5 లక్షల విరాళాన్ని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడుకు ప్రవాసాంధ్రులు అందజేశారు. ప్రవాసాంధ్రులు కాట్రగడ్డ వెంకటేశ్వరరావు, సుధాకర్‌లు ముఖ్యమంత్రిని కలిసారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన తమ తల్లిదండ్రులు స్వర్గీయ కాట్రగడ్డ సుబ్బారావు, కాళికాంబ దంపతుల జ్ఞాపకార్థం ప్రజా రాజధాని అమరావతికి రూ.5 లక్షల విరాళాన్ని ఇస్తున్నట్లు ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ… ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రవాసాంధ్రులు భాగస్వాములు కావాలన్నారు. రాజధాని నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. చరిత్రలో నిలిచిపోయేలా ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తెనాలి మార్కెట్‌యార్డు వైస్‌ ఛైర్మన్‌ అయినంపూడి వెంకట శ్రీధర్‌, టీడీపీ నాయకులు కాకుమాను కనకరాంబాబు, కొత్తమాసు హేమశ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. జారీ చేసిన వారుః సమాచార పౌర సంబంధాల శాఖ; ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

రూ.5 లక్షలు విరాళమిచ్చిన ప్రవాసాంధ్రులు

రూ.5 లక్షలు విరాళమిచ్చిన ప్రవాసాంధ్రులు

రాజధాని నిర్మాణానికి రూ. ౩౦ లక్షల విరాళం
రాజధానికి రూ. ౩౦ లక్షల విరాళం అందించిన ఏపీ విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల సహాయ సంస్థ ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి రూ. 30.25 లక్షల విరాళ మొత్తాన్ని ఏపీ విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల సహాయ సంస్థ ఉద్యోగులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు అందించారు. ఉండవల్లిలో సంస్థ అధ్యక్షుడు గోనుగుంట్ల కోటేశ్వరావు ఆధ్వర్యంలో ఉద్యోగులు సీఎం చంద్రబాబును కలిసారు. స్వచ్ఛందంగా విరాళాలివ్వడానికి ముందుకు వచ్చిన విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల సహాయ సంస్థ ఉద్యోగులు అభినందనీయులని ముఖ్యమంత్రి కితాబిచ్చారు. ఉదారతతో విరాళాలిచ్చిన వికలాంగులను చూసి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ముందుకు వస్తారన్న ఆకాంక్షను ముఖ్యమంత్రి వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నందున తమ వంతు భాగస్వామ్యంగా విరాళాలు ఇచ్చామని సంస్థ ఉద్యోగులు పేర్కొన్నారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ రాష్ట్రానికి నిధుల విడుదలలో మొండిచేయి చూపించడం బాధాకరమని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. సంస్థకు చెందిన 114 మంది ఉద్యోగులు జూన్ నెలలో 15 రోజుల జీతాన్ని విరాళంగా అందించారు. సీఎం చంద్రబాబును కలిసిన వారిలో ఎండీ బి. రామారావు, జనరల్ మేనేజరు డి. శ్రీనివాసరావు, ప్రాజెక్ట్ ఆఫీసర్ వి.విజయకుమార్, యూనియన్ నాయకులు కె.ఈశ్వరరావు, ఓ.సుంకిరెడ్డి, సంస్థ ఉద్యోగులు ఉన్నారు.