info@manadailynews.com
Breaking News

హిందీ నటి కృతిక చౌదరి మృతి

kruthi chowdary

బాలీవుడ్ మోడల్ మరియు నటి కృతిక చౌదరి(30) అనుమానాస్పదంగా చనిపోయింది. సోమవారం (జూన్ 12) సాయంత్రం ముంబైలోని అంధేరిలోని తన ఇంటి నుంచి వాసన వస్తుండటంతో చుట్టుపక్కల వారు పోలీసులకు కంప్లయింట్ ఇచ్చారు. ఇంటి తలుపులు పగులగొట్టి లోపలి వెళ్లారు. ఆమె నిర్జీవంగా పడిఉండటాన్ని పోలీసులు గమనించారు. ఆమె లోపల ఉంటే బయట  తాళాలు ఎవరు వేసి ఉంటారనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఈ మరణం వెనుక హత్య ఉదంతం ఉండొచ్చని పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. ఈ సంఘటన నాలుగు రోజుల క్రితమే జరిగినట్లు గుర్తించారు. కృతిక చౌదరి చివరిగా నటించిన చిత్రం రాజ్జోలో  హీరోయిన్ కంగనాతో కలిసి నటించింది. అంతే కాకా హిందీ సీరియల్స్ లోనూ నటిస్తూ… మోడల్, నటిగా రాణిస్తూ.. ఇండస్ట్రీలో ఎదుగుతున్న సమయంలో ఇలా జరగడం వెనుక ఎవరి హస్తం ఉంది అనే కోణంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.