info@manadailynews.com
Breaking News

ఫిరాయింపుల‌పై స్పీక‌ర్‌కు హైకోర్టు డెడ్‌లైన్‌!

high-court

ముందు వెనుకా లేకుండా ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేలంద‌రికీ గులాబీ కండువాలు క‌ప్పేసిన కేసీఆర్‌కు ఉమ్మ‌డి హైకోర్టు షాకిచ్చింది. టీడీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై దాఖ‌లైన పిటిష‌న్‌పై సంచ‌ల‌న ఆదేశాల‌చ్చింది. టీడీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు అధికార‌ప‌క్షంలో విలీనం కావ‌డం చెల్ల‌ద‌ని స్ప‌ష్టం చేసింది. మూడు నెల‌ల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల సంగ‌తి తేల్చాల‌ని కూడా స్పీక‌ర్‌కు గ‌డువు పెట్టి ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల‌పై ప్ర‌తిప‌క్ష టీడీపీ హ‌ర్షం వ్య‌క్తం చేసింది. బొటాబొటీ మెజార్టీతో అధికారం చేప‌ట్టిన కేసీఆర్ ప‌ద‌విలో కుదురుకోగానే ప్ర‌తిప‌క్ష పార్టీల వెంట‌ప‌డ్డారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ స‌హా, టీడీపీ, సీపీఐ ఇలా అన్ని పార్టీల ఎమ్మెల్యేలపై కేసీఆర్ ఆక‌ర్ష్ మంత్రం ప్ర‌యోగించారు. దాంతో విప‌క్ష పార్టీల‌న్నీ కుదేల‌య్యాయి. టీడీపీలో అయితే శాస‌న‌స‌భాప‌క్షం మొత్తం (ముగ్గురు మిన‌హా) టీఆర్ఎస్‌లో విలీనం అవుతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. దాంతో తెలంగాణ‌లో టీడీపీ దాదాపు ఖాళీ అయ్యే ప‌రిస్థితి నెల‌కొంది. దీంతో టీడీపీ నేత‌లు త‌మ ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై కోర్టుకెక్కారు. ఆ పిటిష‌న్‌ను విచారించిన న్యాయ‌స్థానం బుధ‌వారం ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల నేప‌థ్యంలో శాస‌న‌స‌భ స్పీక‌ర్ తీసుకునే నిర్ణ‌యాన్ని బ‌ట్టి ఫిరాయింపు ఎమ్మెల్యేల భ‌విష్య‌త్తు ఆధార‌ప‌డి ఉంది. అలాగే, ఫిరాయింపు ఎమ్మెల్యేల‌కు సంబంధించి కాంగ్రెస్ వేసిన పిటిష‌న్ సుప్రీంలో విచార‌ణ జ‌రుగుతోంది. ఇప్ప‌టికే ఈ కేసులో నేరుగా స్పీక‌ర్‌కే నోటీసులు జారీ చేసింది. త్వ‌ర‌లోనే దీనిపైనా తీర్పు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఈలోపుగానే హైకోర్టు ఆదేశాలు రావ‌డంతో ఇప్పుడు స్పీక‌ర్ ఎలా స్పందిస్తారో మ‌రి.