info@manadailynews.com
Breaking News

పసిడి పెరిగింది

timthumb

పసిడి ధర మళ్లీ పెరిగింది. 99.9 శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.27,185కు చేరింది. నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు పెరగడం, పెళ్లిళ్ల సీజన్‌ కావడం, ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో దీని ధర పెరిగిందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా సింగపూర్‌ బులియన్‌ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.5శాతం పెరిగి 1,123.88 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. అలాగే ఈరోజు వెండి ధర సైతం పెరిగింది. రూ.90 పెరగడంతో కేజీ వెండి ధర రూ.34,930కి చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు వూపందుకోవడంతో డిమాండు పెరిగి దీని ధర పెరిగిందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి.