info@manadailynews.com
Breaking News

రేప్‌కేసులో చిక్కుకున్న నిర్మాత

rape case

బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరీం మొరానీపై రేప్ కేసు నమోదైంది. సినిమాలో అవకాశం ఇప్పిస్తానని 2015లో బీబీఎం విద్యార్థినిని ట్రాప్ చేసాడు కారి మొరానీ. అదే సంవత్సరం జూలైలో మత్తు మందు ఇచ్చి ఆమెపై రేప్ చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ రేప్ ఫోటోలను తీసి వాటిని అడ్డం పెట్టుకుని ఆరు నెలలపాటు హైదరాబాదు, ముంబై నగరాల్లో తనపై అత్యాచారం చేసాడని ఆమె పోలీస్ ఫిర్యాదులో రాసింది. అండర్ వరల్డ్ మాఫియాతో కూడా మొరానీకి సంబంధాలు ఉన్నాయని పేర్కొంది. ‘దిల్ వాలే’ చిత్రం విడుదలైన సమయంలో కూడా కరీం మొరానీ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె తెలిపింది. పోలీసులు కరీం మొరానీపై నాలుగు సెక్షన్లపై కేసులు నమోదు చేశారు.