info@manadailynews.com
Breaking News

‘బిగ్‌ ఎక్చ్సేంజ్‌ డేస్‌’ పేరుతో ఫ్లిప్‌కార్ట్‌ కొత్త ఆఫర్‌

flipkart big exchange days

ఫ్లిప్‌కార్ట్‌ భారత మార్కెట్లోకి ‘బిగ్‌ ఎక్చ్సేంజ్‌ డేస్‌’ పేరుతో కొత్త ఆఫర్‌ని ప్రకటించింది. ఇక ప్రతి నెలా ఈ ఆఫర్‌ను 1, 2 తేదీల్లో నిర్వహిస్తామని ఓ ప్రకటన ద్వారా తెలిపింది. వినియోగదారుల వద్ద ఉన్న పాత వస్తువుల్ని ఇచ్చి తగ్గింపు ధరతో కొత్త వస్తువులు పొందొచ్చని తెలిపారు. మొబైల్స్‌, టీవీలు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు, ఫ్రిజ్‌లు, వాషింగ్‌ మిషన్‌లు తదితర వస్తువులపై ఈ ఆఫర్‌ వర్తిస్తుందని చెప్పింది.
ఈ ఆఫర్‌ ఫ్లిప్‌కార్ట్‌ యాప్‌, ఫ్లిప్‌కార్ట్‌ లైట్‌ యాప్‌, డెస్క్‌టాప్‌ సైట్‌ల్లో ఎందులోనైనా అందుబాటులో ఉంటుందని చెప్పింది. తమ డెలివరీ బాయ్‌లందరికీ ఈ విధానం అర్థమయ్యేలా, పాత వస్తువుల నాణ్యతని అంచనావేసేలా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.