మరణ ధ్రువీకరణ పత్రాలకు కూడా ఆధార్ ఉండాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అక్టోబర్ 1 నుంచి మరణ ధ్రువీకరణ నమోదుకు ఆధార్ తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. మరణ ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసేవారికి చనిపోయిన వారి ఆధార్ సంఖ్య తెలియకపోతే ‘నాకు తెలిసినంతవరకు మృతుడికి ఆధార్ కార్డు లేదు’ అనే సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది.
మరణ ధ్రువీకరణ పత్రాలకు ఆధార్
