ఇప్పటిదాకా స్వలింగ సంపర్కులు పెళ్లి చేసుకోవడం చూసాము. కానీ ముగ్గురు మగాళ్లు పెళ్లి చేసుకున్నారు. పాలియామరస్ ఫ్యామిలీగా ఆవిర్భవించారు. కొలంబో దేశం గత సంవత్సరం స్వలింగ సంపర్కుల పెళ్ళికి అధికారికంగా ఒకే చెప్పింది.
దీనికి సంబంధించి కొలంబియా మీడియాలో వెలువడిన ఒక వీడియో వైరల్ ఐంది. ఈ ముగ్గురిలో ఒక్కడైన నటుడు విక్టర్ హుగో ప్రాడా మాట్లాడుతూ ‘మేము మా వైవాహిక జీవితానికి అధికారిక గుర్తింపు కోరుకుంటున్నామని, మా కున్న హక్కులను మేము కాపాడుకోవాలని భావిస్తున్నానని ఈ వీడియోలో పేర్కొన్నాడు. జాన్ అలెజాండ్రో రోడ్రిగూ, మాన్యూల్ జోన్ బెర్మాముండేజ్ వీరిద్దరిని పెళ్లి చేసుకున్నట్లు వెల్లడించాడు. తమ వివాహానికి సంబంధించిన లీగల్ పేపర్లపై మెడిలిన్ నగరానికి చెందిన అధికారి సమక్షంలో సంతకాలు కూడా చేపించుకున్నామని… ఇకపై తమ కుటుంబానికి న్యాయపరమైన గుర్తింపు వస్తుందన్నారు. ప్రపంచంలోనే తమదే తొలి పాలియామర్ ఫ్యామిలీ అని పేర్కొన్నారు.
ముగ్గురు మగాళ్లు ఒక్కటయ్యారు!
