info@manadailynews.com
Breaking News

మంత్రి పదవి అందుకోనున్న బాలయ్య!

balakrishna

నటసింహం బాలయ్య అభిమానులకు ఆనందం కలిగించనున్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు రాజకీయాల్లో, తన నియోజక వర్గం హిందూపరం అభివృద్ధి పనుల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే ఆయన అభిమానులు ఎప్పటి నుండో బాలయ్య ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. కానీ బాలయ్య మాత్రం అలాంటి ఆశలు తనకు లేవని, అలాగే అలాంటి అవకాశం వస్తే తప్పకుండా అదే జరుగుతుంది అంటూ చెప్పుకొచ్చారు.

బాలయ్య అభిమానులను మంచి చేసుకోవాలనుకున్నారో, ఆయన పాపులారిటీకి తగిన విధంగా గౌరవం ఇవ్వాలి అనుకున్నారో ఏమో మరి ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు బాలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. బాలయ్య సినీ బ్యాక్ గ్రౌండ్ దృష్టిలో పెట్టుకుని ఆయనకు సినిమాటోగ్రఫీ శాఖ ఇవ్వాలని బాబు బావిస్తున్నారట. ఆ శాఖను బాలయ్యకు అప్పగిస్తే ఏపీలో సినీ కార్యకలాపాలు ఊపందుకుంటాయని బాబు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఏది ఏమైనా త్వరలో బాలయ్య మంత్రి పదవి అధిరోహిస్తారన్నది హాట్ టాపిక్‌గా మారింది.