info@manadailynews.com
Breaking News

చిరు 150 వ సినిమాలో ఆ ఎమ్మెల్యే ఐటెం సాంగ్!

chiru 150 movie

మెగా స్టార్ చిరంజీవి 150 వ చిత్రం ‘ఖైదీ నెంబర్ 150’ వేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. ప్రస్తుతం  హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరుపుతున్నారు. హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తుంది. నిర్మాతగా రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఓ పాత కోసం ఐటెం గాళ్‌‌ను వెతికే పనిలో పడ్డాడట డైరెక్టర్. చిరంజీవి సినిమాలు అంటే మాస్ మసాలా ఎలిమెంట్స్ పక్కా ఉండాలని కథతో పాటు మసాలా లాంటి అదిరిపోయే ఐటెం సాంగ్‌‌ను పెట్టబోతున్నట్లు టాక్ నడుస్తోంది. సరైనోడు చిత్రంలో యంగ్ ఎమ్మెల్యేగా నటించిన కేథరిన్‌‌ను ఫైనల్ చేశారని సమాచారం. ఇక ఈ విషయం తెలుసుకున్న కేథరిన్ తెగ సంతోషపడుతోందట. మొదట తమన్నాను అనుకున్నారట. కానీ చివరికి అల్లు అర్జున్ హీరోయినే ఎంచుకున్నారు. దీనిపై వి వి వినాయక్ ఇంతవరకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.

Catherine TresaCatherine Tresa1