info@manadailynews.com
Breaking News

ఎన్నారై

గల్ఫ్‌లో ఉపాధి కల్పనకు తెలంగాణ ఒప్పందం

gulfjobs

తెలంగాణాలోనే కాదు, విదేశాల్లోనూ ఉద్యోగాల కల్పనపై కేసీఆర్‌ సర్కార్‌ దృష్టి పెట్టింది. ఉపాధి కోసం ఇతర దేశాలకు వెళ్తోన్న కార్మికుల సమస్యల పరిష్కారానికి నడుం బిగించింది. ఇక దేశవ్యాప్తంగా దాదాపు 60 లక్షల మంది గల్ఫ్ దేశాల్లో ఉపాధి కోసం వెళ్తుంటే కెవలం తెలంగాణ నుంచే 10 లక్షల మంది కార్మికులు వెళ్తున్నట్లు సమాచారం. ఇక వీరిలో చాలా మంది బోగస్‌ ఏజెంట్ల చేతిలో మోసపోయి పరాయి దేశాల్లో నానా కష్టాలు పడుతున్నారు. అక్కడి చట్టాలు, నిబంధనలు తెలియక, చనిపోతే స్వదేశానికి తీసుకురావడానికి కూడా ...

Read More »

ముగ్గురు భారతీయ సంతతి ఎన్నారైలకి అరుదైన గౌరవం

doctor

ఆస్ట్రేలియాలో భారతీయ సంతతి ఎన్నారైలకి ఓ అరుదైన గౌరవం దక్కింది. కాన్‌ బెర్రాలోని ఆస్ట్రేలియా నేషనల్‌ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న చెన్నుపాటి జగదీశ్‌కు ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్‌ ఆఫ్‌ ఆస్ట్రేలియా దక్కింది. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచినవారికి ప్రతి సంవత్సరం ఈ అవార్డులను ప్రధానం చేస్తారు. ఈ ఏడాది మొత్తం 600ల మందికి ఈ పురష్కారాలు దక్కాయి. అవార్డు గ్రహీతల్లో మరో ఇద్దరు భారతీయులు కంటి వైద్య నిపుణులు జయ చంద్ర, సంజీవ్ కోషీ దంత వైద్య విపుణుడు ఆ ...

Read More »

హరితాంధ్ర కోసం నాట్స్ ఆర్థిక సాయం

harithapriya

హరితాంధ్ర‌ప్రదేశ్ సాధనకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తనవంతు సాయం చేసేందుకు ముందుకొచ్చింది. విజయవాడలో హరిత ప్రియ ప్లాంట్ ప్లవర్ సోసైటీ నిర్వహించిన మెగా ప్లవర్ షోకు నాట్స్‌ లక్ష రూపాయల చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందించింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాట్స్ సంఘాన్ని అభినందించారు. ప్లవర్ షో నిర్వాహకులపై ప్రశంసలు కురిపించారు. ఏపీని హరితాంధ్రగా మార్చడానికి ఇలాంటి షోలు చాలా సాయపడతాయని ఆయన అన్నారు. హుదుద్ వల్ల తీవ్రంగా నష్టపోయిన విశాఖలో హరిత ప్రియ ప్లాంట్ ప్లవర్ సోసైటీ స్థానిక గ్లో ...

Read More »

న్యూయార్క్‌లో నాటా ఫండ్ రైజింగ్ కార్యక్రమం

NATA fundraising event in New York

ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాటా మే 27న డల్లాస్‌లో నిర్వహించనున్న మహాసభల కోసం నిధుల సమీకరణకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా నాటా న్యూయార్క్ విభాగం న్యూయార్క్‌లోని కట్టీలియన్ రెస్టారెంట్‌లో ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని నిర్వహించింది. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో తెలుగు ఎన్‌ఆర్ఐలు పాల్గొన్నారు. తీవ్రమైన మంచు, చలిలో కూడా తెలుగు వారు పిల్లలతో సహా కార్యక్రమంలో పాల్గొని విరాళాలు ఇచ్చారు. ఈ సందర్భంగా విరాళాలు ఇచ్చిన వారందరికీ నాటా ప్రెసిడెంట్‌ మోహన్‌ మల్లం కృతజ్ఞతలు తెలిపారు.

Read More »

అమెరికాలో భారత గణతంత్ర వేడుకలు

3

భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు అమెరికాలో ఘనంగా జరిగాయి. హివోవా రాష్ట్రంలోని డెస్ మైన్ ప్రాంతంలో ఎన్నారైలు భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. బాలవిహార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో మాజీ చీఫ్ జస్టిస్ మార్షా టెర్నస్ ముఖ్య అతిథిగా పాల్గొని భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. భారత జాతి గొప్పదనంపై ప్రసగించారు. కార్యక్రమంలో పలు సాంస్కతిక కార్యక్రమాలను నిర్వహించారు. ప్రవాస భారతీయులు కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

Read More »

దుబాయ్‌లో తెలుగి వారి సంక్రాంతి వేడుకలు

దుబాయ్‌లోని ప్రవాస తెలుగు ప్రజలు సంక్రాంతి వేడుకలను ఆనందోత్సాహాల మధ్య చేసుకున్నారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగించారు. ముగ్గుల పోటీలు, ఫెయింటింగ్‌, పతంగుల పోటీలను నిర్వహించారు. తెలుగు సంఘం వేవ్ రిసోనెన్స్ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించుకున్నారు. భోగి పల్లను పిల్లల తలలపై పోసి దీవించారు. ఆటపాటలతో సరదాగా గడిపారు.

Read More »

శ్రీవారి సేవలో తానా అధ్యక్షుడు వేమన సతీష్‌

తానా అధ్యక్షుడు వేమన సతీష్‌ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేమన సతీష్ దంపతులకు స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు టిటిడి అధికారులు. సంక్రాంతి రోజున స్వామి వారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్న ఈ సందర్భంగా వేమన సతీష్‌ అన్నారు. అమెరికాలోని తెలుగువారి కోసం నిరంతరం పాటుపడతానని ఆయన అన్నారు. తెలుగు విద్యార్థుల సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయని ఆయన ఆశా భావం వ్యక్తం చేశారు.

Read More »

అమెరికాలో సాంప్రదాయ బద్దంగా అయ్యప్ప పూజ

అమెరికాలో ప్రవాస భారతీయులు సాంప్రదాయ బద్దంగా, భక్తిశ్రద్దలతో అయ్యప్ప పూజ నిర్వహిస్తున్నారు. ఎముకలు కొరికే చలిలో కూడా ఎన్‌ఆర్‌ఐలు అయ్యప్ప పడి పూజ నిర్వహించారు. నార్త్ కరోలినా రాష్ట్రంలోని గ్రీన్స్ భరో నగరంలో స్థానిక ట్రైయాడ్ హిందూ మందిరంలో ఏర్పాటుచేసిన అయ్యప్ప మండపంలో…. మెట్ల పూజ నిర్వహించారు. పూలు, పండ్లతో స్వామి వారి మెట్లను ఎందో అందంగా తీర్చి దిద్దారు. ఆలయ పూజారి మురళీశర్మ ఆధ్వర్యంలో ముందుగా గణపతి హోమం, వినాయక పూజ అనంతరం కుమార స్వామి పూజలను నిర్వహించారు. పంచామృతంతో అభిషేకం, పడిపూజ ...

Read More »

భారతీయ అమెరికన్ సత్య నాదెళ్లకు అదురైన గౌరవం

మైక్రోసాప్ట్ CEO, భారతీయ అమెరికన్ సత్య నాదేళ్లకు అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రెసిడెంట్ హోదాలో చివరి సారిగా ప్రసంగించే కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాదేళ్లకు దక్కింది. ఒబామా సతీమణి మిచెల్ ఒబామా ప్రత్యేకంగా సత్య నాదెళ్లను కలిసి ఆహ్వానించినట్లు వైట్ హౌజ్ వర్గాలు తెలిపాయి.

Read More »

హూస్టన్‌ నగరంలో 56వ రోజు సాయి పాదుకల యాత్ర

అమెరికాలో షిర్డితరహా ఆలయాన్ని నిర్మించేందుకు సాయిదత్త పీఠం తలపెట్టిన సాయిపాదుకల యాత్ర‌కు భక్తుల నుండి పెద్ద ఎత్తున మద్దతు వస్తోంది. యాత్ర అమెరికా అంతటా సాగుతోంది. అన్నిరాష్ట్రాలు తిరుగుతూ 56 వ రోజు హూస్టన్ నగరం చేరుకుంది. సాయిపాదుకలు తమ ఇంటికి రావడం గొప్ప అదృష్టంగా ప్రవాస భారతీయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read More »