info@manadailynews.com
Breaking News

బిజినెస్

‘బిగ్‌ ఎక్చ్సేంజ్‌ డేస్‌’ పేరుతో ఫ్లిప్‌కార్ట్‌ కొత్త ఆఫర్‌

flipkart big exchange days

ఫ్లిప్‌కార్ట్‌ భారత మార్కెట్లోకి ‘బిగ్‌ ఎక్చ్సేంజ్‌ డేస్‌’ పేరుతో కొత్త ఆఫర్‌ని ప్రకటించింది. ఇక ప్రతి నెలా ఈ ఆఫర్‌ను 1, 2 తేదీల్లో నిర్వహిస్తామని ఓ ప్రకటన ద్వారా తెలిపింది. వినియోగదారుల వద్ద ఉన్న పాత వస్తువుల్ని ఇచ్చి తగ్గింపు ధరతో కొత్త వస్తువులు పొందొచ్చని తెలిపారు. మొబైల్స్‌, టీవీలు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు, ఫ్రిజ్‌లు, వాషింగ్‌ మిషన్‌లు తదితర వస్తువులపై ఈ ఆఫర్‌ వర్తిస్తుందని చెప్పింది. ఈ ఆఫర్‌ ఫ్లిప్‌కార్ట్‌ యాప్‌, ఫ్లిప్‌కార్ట్‌ లైట్‌ యాప్‌, డెస్క్‌టాప్‌ సైట్‌ల్లో ఎందులోనైనా అందుబాటులో ఉంటుందని ...

Read More »

పసిడి పెరిగింది

timthumb

పసిడి ధర మళ్లీ పెరిగింది. 99.9 శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.27,185కు చేరింది. నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు పెరగడం, పెళ్లిళ్ల సీజన్‌ కావడం, ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో దీని ధర పెరిగిందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా సింగపూర్‌ బులియన్‌ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.5శాతం పెరిగి 1,123.88 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. అలాగే ఈరోజు వెండి ధర సైతం పెరిగింది. రూ.90 పెరగడంతో కేజీ వెండి ధర రూ.34,930కి చేరింది. పారిశ్రామిక ...

Read More »

నష్టాలతో ప్రారంభ మైన స్టాక్ మార్కెట్లు

mumbai stock market

గురువారం స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ఆరంభమయ్యాయి. సెన్సెక్స్ 16 పాయింట్లు, నిఫ్టీ 4 పాయింట్ల నష్టంలో కొనసాగుతున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 29 నెలల కనిష్ఠానికి పడిపోయింది. ప్రారంభ ట్రేడింగ్‌లో 14 పైసలు కోల్పోయిన రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే 68.19 పైసలు వద్ద నమోదైంది.

Read More »

భారత్ లో భారీగా పెట్టుబడులు: టిమ్ కుక్

tim-cook

భారత్‌ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రిక్ దేశంగా అవతరిస్తుందని యాపిల్ సీఈవో టిమ్ కుక్ తెలిపారు. ‘‘ఇండియాలో వేగంగా విస్తరిస్తున్న మార్కెట్ ఉంది. ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలపై సానుకూలంగా ఉంది. అందుకే మేం ఆ దేశంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. దీర్ఘకాలంలో అధిక మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తాం’’ అని రానున్న కాలంలో వ్యాపారానికి అనువైన పరిస్థితులు ఏర్పడతాయని ఆయన వివరించారు. భారత్ మంచి వృద్ధి రేటు నమోదు చేస్తోందని అమెరికా, చైనా తర్వాత మూడో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్ భారత్ లోనే ఉందన్నారు. ...

Read More »

రూ.3,357 కోట్లు లాభాల్లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్

hdfc ban

2015 డిసెంబర్ 31 ముగింపు నాటి మూడో త్రైమాసిక ఫలితాల్లో దేశీయ రెండో అతిపెద్ద రుణదాత సంస్థ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ తన అంచనాలను అందుకుంది. సంస్థ నికర లాభం రూ. 3,357 కోట్లతో 20 శాతం పెరిగింది. గత సంవత్సరం బ్యాంకు లాభం రూ.2,795 కోట్లుగా ఉంది. నికర వడ్డీ ఆదాయం రూ.7,068.50 కోట్లతో 24 శాతం పెరిగింది. ఇతర ఆదాయం రూ.2,872 కోట్లతో 30 శాతం వృద్ధిని సాధించింది. గత మూడు నెలల్లో స్థూల నిరర్థక రుణాలు 0.91 శాతం నుంచి 0.97 ...

Read More »

అమెజాన్ ఇండియాకు రూ.1,724 కోట్లు నష్టాలు

amazon

దేశంలోని ఆన్‌లైన్ మార్కెట్ దిగ్గజాలలో ఒక్కటైన అమెజాన్ ఇండియా నికర నష్టాలు పెరిగాయి. 2015 మార్చి ముగింపు నాటికి భారత్ వ్యాపారంలో సంస్థకు నష్టం రూ.1,724 కోట్లకు పెరిగింది. ఇదే దశలో ఆన్‌లైన్ మార్కెట్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ సహా బిగ్ 3 కంపెనీల మొత్తం నష్టం రూ.5,052 కోట్లకు చేరింది. భారీ డిస్కౌంట్లతో కొనుగోలుదారులను ఆకర్షించే ఈ సంస్థలు పోటీపడినా లాభాలను అందుకోలేకపోయాయి. అయితే 2014-15 సంవత్సరంలో అమేజాన్ ఇండియా అమ్మకాలు రూ.1,022 కోట్లతో ఆరు రెట్లు పెరిగాయి. ఇంతక ముందు సంవత్సరంలో ...

Read More »

26 పైసలు బలపడిన రూపాయి

గురువారం మార్కెట్ ప్రారంభం నుంచి రూపాయి బలపడుతూ వస్తోందని ట్రేడింగ్ వర్గాలు తెలిపాయి. దీంతో డాలర్‌తో రూపాయి మారకం విలువ బలపడుతోంది. రూపాయి మారకం విలువ 26 పైసలు బలపడి 67.76 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో బుధవారం రూపాయి మారకం విలువ రెండేళ్లు కనిష్ఠ స్థాయికి పడిపోయిన విషయం విదితమే. కానీ విదేశీ మార్కెట్ల వృద్ధితో పాటు , దేశీయ ఈక్విటీ మార్కెట్లు బలపడిన క్రమంలో రూపాయివ విలువ కాసింత కోలుకుని , స్వల్పంగా బలపడిందని ట్రేడింగ్ వర్గాలు వెల్లడించాయి.

Read More »

16 వేల మంది ఉద్యోగులపై వాల్‌మార్ట్ వేటు

ప్రముఖ వ్యాపార సంస్థ వాల్‌మార్ట్ 16వేల మంది ఉద్యోగులపై తీసివేసింది. గత ఏడాది 30శాతం నష్టాలు రావడంతో వాల్‌మార్ట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 269 స్టోర్లలో పని చేస్తున్న ఉద్యోగులపై ఈ ప్రభావం పడింది. ఉద్యోగులపై వేటు పడుతున్న 269 స్టోర్లలో 154 అమెరికాలోనే ఉన్నాయి. మిగిలినవి బ్రెజిల్, లాటిన్ అమెరికా దేశాల్లో ఉన్నాయి. ఉద్యోగం నుంచి తొలగించిన వారందరికీ కంపెనీ రెండు నెలల జీతం ఇచ్చి పంపనుంది. గత ఏడాది అక్టోబరు నుంచి ఉద్యోగుల పనితీరును సమీక్షిస్తున్న వాల్‌మార్ట్ ఈ కీలక ...

Read More »

స్టాక్ మార్కెట్లో బ్లాక్ మండే

కుప్పకూలిన చైనా మార్కెట్లు కూలిపోయిన ఆసియా మార్కెట్లు అమ్మకాల ఒత్తిడికి లోనైన సెన్సెక్స్‌, నిఫ్టీ లిస్టెడ్‌ కంపెనీల షేర్లపై నిషేధం ఎత్తివేత అమ్మకాలకు దిగిన ఇన్వెస్టర్లు 7 శాతం నష్టపోయిన చైనా మార్కెట్ సూచీలు నిలిచిపోయిన ట్రేడింగ్‌ వరుసగా పదో నెల్లోనూ తగ్గిన చైనా మ్యానుఫ్యాక్చరింగ్ డేటా డాలర్‌తో పోలిస్తే ఐదేళ్ల కనిష్టానికి చైనీస్ యువాన్ నిఫ్టీ టాప్‌ లూజర్స్‌ : టాటామోటార్స్, ఐడియా, బ్యాంక్ ఆఫ్ బరోడా నిఫ్టీ టాప్‌ లూజర్స్‌ : హిందాల్కో, పంజాబ్ నేషనల్ బ్యాంక్.

Read More »

భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు

సోమవారం స్టాక్ మార్కెట్లు భారీ పతనాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ ఏకంగా 473 పాయింట్లు కోల్పోయి 25687 వద్ద, నిఫ్టీ 150 పాయింట్లు కోల్పోయి 7812 వద్ద కొనసాగుతున్నాయి. చైనా మార్కెట్లు భారీగా పడిపోవడమే మన మార్కెట్ల పతనానికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read More »