మీరు చూస్తున్న ఫోటోలు ఎక్కడో ఏటీఎం దగ్గర డబ్బులకోసమో.. సినిమా రిలీస్ రోజు టిక్కెట్ల కోసమో.. క్యూలో నిల్చున్నట్లు ఉంది కదా! కానీ కాదు. ఇది జూబ్లీహిల్స్ లోని బ్రాండ్ ఫ్యాక్టరీ షోరూం దగ్గర దృశ్యం. కస్టమర్లను ఆఫర్లతో ముంచెత్తి క్యాష్ చేసుకోవాలనుకున్న బ్రాండ్ ఫ్యాక్టరీకి బోర్లాపడినట్టైంది. తక్కువ ధరకే ఈనెల 15న పేపర్లలో ఎలక్ట్రానిక్ ఛానళ్లలో బ్రాండ్ ఫ్యాక్టరీ భారీ సేల్ అని, రూ. 5000 కొనుకోండి.. 2000 మాత్రమే చెల్లించండి అని చెప్పడమే కాదు. దీంతో పాటు రూ. 1000 ల విలువగల షర్ట్, మరో రూ. 1000ల విలువగల కాష్ వోచర్, మరో రూ. 400 కాష్ బ్యాక్ ఇది బ్రాండ్ ఫ్యాక్టరీ ఆఫర్. ఇక ఎవరు ఆగుతారు చెప్పండి. అందులో 16, 17, 18 వరకు మాత్రమే పరిమితం చేయడంతో ఆయా బ్రాండ్ ఫ్యాక్టరీ షోరూంల దగ్గర జనం తండోపతండాలుగా ఎగబడుతున్నారు. దీంతో యాజమాన్యం ఏమి చేయలేక షట్టర్లు మూసేసి వెనక్కి పంపిస్తున్నారు. ఇక శని ఆది వారాలు వీరి సంఖ్యా ఎక్కువయ్యే ప్రమాదం ఉండడంతో చాలా చోట్ల బ్రాండ్ ఫ్యాక్టరీ షోరూంలకు తాళాలు వేసేస్తున్నారు.