info@manadailynews.com
Breaking News

బోయపాటికి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్!

boyapati directed prabhas

అల్లు అర్జున్‌తో ‘సరైనోడు’ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు బోయపాటి శ్రీను త్వరలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఓ చిత్రం తీయడానికి సిద్ద మవుతున్నాడు. ఈ సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్లకుండానే బోయపాటి తదుపరి చిత్రంపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటె ప్రభాస్, మహేశ్ బాబు బోయపాటి డైరెక్షన్‌లో నటిస్తారనే వార్త  సినీవర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ఇప్పటికే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే వార్త ఫిలింనగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ‘బాహుబలి-2’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు ప్రభాస్. ఈ చిత్రం తరువాత ఎవరి డైరెక్షన్‌లో నటిస్తారనే సమాచారం. అయితే ఈ విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇటీవలే బోయపాటి ప్రభాస్‌ను కలిసి కథ వినిప్న్చాడని, ఈ కథ నచ్చి ప్రభాస్ ఓకే చెప్పాడని! ‘బాహుబలి’ సీక్వెల్ తరువాత వీరిద్దరి కాంబినేషన్‌లో మూవీ సెట్స్ మీదకు వెళుతుందని ఫిలింనగర్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.