info@manadailynews.com
Breaking News

ఒబామాకు క‌మ్యూనిస్టుల దెబ్బ‌

obama

అమెరికా అధ్య‌క్షుడు ఒబామాకు క‌మ్యూనిస్టు దెబ్బ రుచి చూపించారు చైనా అధికారులు. ప్ర‌పంచ దేశాల‌కు తాను రాజున‌ని గ‌ర్వంతో పొంగిపోయి… ద‌ర్వం ప్ర‌ద‌ర్శించే అమెరికా అధ్య‌క్షుడికి ఆ గ‌ర్వం దిగే దెబ్బ కొట్టింది చైనా ప్ర‌భుత్వం. జీ 20 దేశాల స‌ద‌స్సులో పాల్గొనేందుకు చైనా వ‌చ్చిన ఒబామాకు త‌మ సొంత మ‌ర్యాద చూపించి అగ్ర‌రాజ్య పొగ‌బోతు తనానికి చెక్ పెట్టింది. అమెరికా అధ్య‌క్షుడు ఏ దేశంలో ప‌ర్య‌టించినా త‌న తిండిద‌గ్గ‌ర నుంచి భ‌ద్ర‌త వ‌ర‌కూ ఆమెరికా అధికారులే చూసుకుంటారు. గ‌తంలో భార‌త్‌లో ఒబామాప‌ర్య‌టించిన సంద‌ర్భంలోనూ ఇదే జ‌రిగింది. ఆయ‌న అడుగుపెట్టే ప్రాంతాన్ని అమెరికా అధికారులు పూర్తిగా త‌మ ఆధీనంలోకి తీసుకుని ఆతిథ్య దేశ‌పు  అధికారుల‌ను ఆ చుట్టుప‌క్క‌ల‌కు కూడా రానీయ‌కుండా ద‌ర్పం ప్ర‌దర్శిస్తారు అమెరికా అధికారులు. ఇప్పుడు చైనాలోనూ ఇలాగే చేద్దామ‌ని ప్ర‌య‌త్నించిన అమెరికా అధికారుల‌కు దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చారు చైనా అధికారులు. ఒబామా విమానం దిగే ద‌గ్గ‌ర నుంచి ఆయ‌న విడిది చేసే ప్రాంతంలో భ‌ద్ర‌త వ‌ర‌కూ అన్నీ తాము చెప్పిన‌ట్లే జ‌రుగుతాయ‌ని ఇందులో అమెరికా అధికారులు వేలు పెట్ట‌డానికి లేద‌ని తేల్చి చెప్పారు. చెప్ప‌డ‌మే కాదు ఆచ‌ర‌ణ‌లో చూపించారు. ఆయన ఎక్కి వచ్చిన విమానానికి స్టెయిర్‌కేస్‌ కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో విమానానికే ఉన్న మెట్ల ద్వారా ప్రత్యామ్నాయమార్గంలో ఒబామా దిగాల్సి వచ్చింది. ఒబామా మా దేశాధినేత ఆయ‌నను మేమే కంటికి రెప్ప‌లా కాపాడుకుంటాం అన్న అమెరికా అధికారికి చైనా అధికారులు ధీటైన స‌మాధానం ఇచ్చారు. ఇది మా దేశం. ఇక్క‌డ మేం చెప్పిన‌ట్లే వినాలి. మా ఎయిర్‌పోర్ట్‌లో నిబంధ‌న‌లు పాటించాల్సిందే అని ఒబామా బృందానికి తేల్చి చెప్పిన చైనా అధికారులు అన్నంత ప‌ని చేశారు. దీనిపై ఒబామా అధికార బృందం తీవ్ర ఆవేద‌న‌ను వెళ్ల‌గ‌క్కింది. ప్ర‌పంచంలో తాము ఎక్క‌డా ఇలాంటి ప‌రిస్థితి ఎదుర్కోలేద‌ని వాపోయింది.