info@manadailynews.com
Breaking News

భాగ్య‌న‌గ‌రితో వీడిన బంధం!

amaravathi

భాగ్య‌న‌గ‌రంతో ఏపీ ప్ర‌జ‌ల బంధం తెగిపోయింది. ఇక‌పై హైద‌రాబాద్ అంటే పోరుగు రాష్ట్ర రాజ‌ధాని కానుంది. చ‌ట్టం ప్ర‌కారం ఉమ్మ‌డి రాజ‌ధానిగా ప‌దేళ్లు ఉండ‌నున్న‌ప్ప‌టికీ ప్ర‌భుత్వాలు, ప్ర‌జ‌ల‌కు హైద‌రాబాద్‌తో బంధం తెగిపోనుంది. ఇందుకు ద‌స‌రానే ముహుర్తం కానుంది. సీఎం విజ‌య‌వాడ‌లో ఉంటున్న‌ప్ప‌టికీ వివిధ శాఖ‌లు హైద‌రాబాద్‌లోనే ఉండిపోవ‌డంతో ప్ర‌జ‌లు ప్ర‌తి ప‌ని కోసం హైద‌రాబాద్‌కు రాక‌పోక‌లు సాగిస్తూనే ఉన్నారు. ఇక అలా ప‌ని కోసం హైద‌రాబాద్ వ‌చ్చే అవ‌స‌రం కూడా ఇక‌పై ఉండ‌దు. కార‌ణం ద‌స‌రా త‌ర్వాత పూర్తిగా రాజ‌దాని కార్య‌క‌లాపాలు వెల‌గ‌పూడి నుంచే జ‌ర‌గ‌నున్నాయి. వ‌చ్చే నెల(అక్టోబ‌రు) మూడో తేదీ నాటికి హైద‌రాబాద్‌లోని ఏపీ శాఖ‌ల‌న్నీ వెల‌గ‌పూడిలోని తాత్కాలిక స‌చివాల‌యంలో కొలువుదీరాల‌ని ఏపీ ప్ర‌భుత్వం స్ప‌ష్ట‌మైన ఆదేశాలిచ్చింది. దీంతో ఉద్యోగులు పూర్తిగా త‌ర‌లిపోనున్నారు. మొన్న అసెంబ్లీ స‌మావేశాలను హైద‌రాబాద్‌లో నిర్వ‌హించిన ఏపీ స‌ర్కారు హైద‌రాబాద్‌లో ఇవే చివ‌రి స‌మావేశాల‌ను వెల్ల‌డించింది. చంద్ర‌బాబు కూడా  ఏదైనా ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం ఉంటే త‌ప్పించి ఇక్క‌డ‌కు ఇక రాలేం అంటూ వీడ్కోలు వ‌చ‌నాలు ప‌లికారు. వ‌చ్చే బ‌డ్జెట్ అంసెబ్లీ స‌మావేశాలు వెల‌గ‌పూడిలోని కొత్త అసెంబ్లీ భ‌వ‌నాల్లోనే జ‌రుగుతాయ‌ని తాజాగా ఆర్థిక మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలో హైద‌రాబాద్‌తో ఏపీ ప్ర‌జ‌ల బంధం పూర్తిగా తెగిపోనుంది. దాంతో హైద‌రాబాద్ పూర్తిగా తెలంగాణ వ‌శం కానుంది. అయితే ఉమ్మ‌డి హైకోర్టు ఇక్క‌డ ఉంది కాబ‌ట్టి ఏదైనా కోర్టుప‌ర‌మైన ప‌నులు ఉంటే త‌ప్పించి ఇక ఏ అధికారి, ఏపీ పౌరుడు కూడా హైద‌రాబాద్ రావాల్సిన ప‌ని ఉండ‌దు.