info@manadailynews.com
Breaking News

క్షమాపణ చెప్పిన రోజా!

roja sorry

త‌న‌పై విధించిన స‌స్పెన్ష్‌ను ఎత్తివేయించుకునేందుకు రోజా దిగొచ్చారు. పౌరుషానికి ప‌ట్టుద‌ల‌కు తాను పెట్టింది పేర‌ని క్ష‌మాప‌ణ చెప్పే ప్ర‌స‌క్తే లేద‌ని బీరాలు పో్యిన ఈ జ‌గ‌న్ చెల్లి ఇప్పుడు త‌ప్ప‌యిపోయింది అంటూ వేడుకున్నారు. స‌భ‌లో చేసిన‌దానికి క్ష‌మాప‌ణ‌లు చెబుతూ స్పీక‌ర్‌కు లేఖ రాశారు. సీఎంకు వ్య‌తిరేకంగా కామ చంద్ర‌బాబు అంటూ అసెంబ్లీలో నినాదాలు చేసి తాను త‌ప్పు చేశాన‌ని ఒప్పుకున్నారు. త‌న మాట‌ల ద్వారా ఎవ‌రినైనా నొప్పించి ఉంటే క్ష‌మించాలంటూ ఎమ్మెల్యే అనిత‌ను కూడా కోరారు. విజ‌య‌వాడ‌లో కాల్ మ‌నీ వ్య‌వ‌హారం బ‌య‌ట ప‌డిన సంద‌ర్భంలో అసెంబ్లీలో సీఎంకు వ్య‌తిరేకంగా జ‌గ‌న్ పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళ‌న‌కు దిగిన స‌మ‌యంలో రోజా చేసిన గ‌లాటా వివాద‌స్ప‌ద‌మైంది. చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే అనిత‌పైనా నిందాపూర్వ‌క వ్యాఖ్య‌లు చేశారు. దీంతో జ‌గ‌న్ను దెబ్బ‌కొట్టేందుకు రోజాపై ప్ర‌భుత్వం వేటేయించింది. స‌భ‌లో ప్ర‌వ‌ర్త‌న‌కు క్ష‌మాప‌ణ చెప్పాల‌ని రోజాను కోరినా ఆమె స్పందించ‌క‌పోవ‌డంతో రోజాను స‌భ నుంచి ఏడాది పాటు స‌స్పెండ్ చేశారు. ఈ స‌స్పెన్ష‌న్‌పై రోజా హైకోర్టు, సుప్రీం కోర్టులోనూ పోరాటం చేశారు. స‌భ‌లో జ‌రిగిన‌దానిపై జోక్యం చేసుకునేందుకు నిరాక‌రించిన న్యాయ‌స్థానాలు స్పీక‌ర్ ద‌గ్గ‌రే తేల్చుకోవాల‌ని, స‌భ‌కు క్ష‌మాప‌ణ చెప్పి వివాదాన్ని సెటిల్ చేసుకోవాల‌ని రోజాకు స‌ల‌హా ఇచ్చాయి. ఆమె క్ష‌మాప‌ణ చెబితే స‌సెన్ష‌న్ ఎత్తేసే అంశాన్ని ప‌రిశీలించాల‌ని సూచించాయి. దాంతో ఇన్నాళ్లు వేచి ఉన్న రోజా ఎట్ట‌కేల‌కు క్ష‌మాప‌ణ‌లు చెబుతూ స్పీక‌ర్‌కు ల‌ఖ రాశారు. అంటే వ‌చ్చే వారంలో ప్రారంభం కానున్న అసెంబ్లీలో మ‌ళ్లీ రోజా విక‌సించే అవ‌కాశం క‌నిపిస్తోంది.