info@manadailynews.com
Breaking News

అనుష్క శర్మకి ఏమైంది?

pari anushka sharma

చూడగానే ఆకట్టుకొనే రూపం.. ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసే నటన.. అనుష్క శర్మ సొంతం.. అయితే ఇప్పుడు నీలికళ్ళతో మొఖం అంత మచ్చలతో భయంకరంగా కనిపిస్తుంది. విషయానికొస్తే అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘పరి’ చిత్రం కోసం ఈ గెటప్‌ వేసింది. మంగళవారం ఈ చిత్ర షూటింగ్‌ ప్రారంభమైంది. ఈ సందర్భంగా అనుష్క ఫస్ట్‌లుక్‌ను ట్విటర్‌ ద్వారా విడుదల చేసింది. ఈ చిత్రానికి నిర్మాతగా అనుష్క వ్యవహరిస్తోంది. ఎప్పుడూ గ్లామరస్‌గా తెరపై ఆకట్టుకున్న అనుష్క ఉన్నట్టుండి ఇలాంటి గెటప్‌ వేయడంతో ఈ సినిమాపై ఇప్పటినుంచే బాలీవుడ్‌లో అంచనాలు పెరిగిపోయాయి. అనుష్క ఇదివరకే ‘ఫిల్లోరి’ అనే చిత్రంలో దెయ్యం పాత్రా చేసింది. ఈ చిత్రానికి దర్శకత్వం ప్రోసిత్‌ రాయ్‌ వహిస్తున్నారు. పరంబ్రతా చటర్జీ కీలక పాత్రలో నటిస్తున్నారు.

Pari first look