info@manadailynews.com
Breaking News

అమ్మ ఆస్పత్రి ఖర్చులు రూ.80కోట్లు!?

hospital

దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్పత్రి వైద్య ఖర్చుల బిల్లు రూ.80 కోట్లుగా తేలింది. ఓ సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం కింద వేసిన పిటిషన్‌ ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి. జయలలిత 75 రోజుల పాటు చెన్నై అపోలో ఆస్పత్రిలో ఉన్నారు. ఆ సమయానికి గాను అపోలో ఆస్పత్రి మేనేజ్ మెంట్ రూ.80 కోట్లు బిల్లు వేసినట్లు తెలుస్తోంది. ఇవిగాక ఇతరత్రా ఖర్చులు కూడా భారీగానే పడనున్నాయి. అమ్మ బిల్లుకు సంబంధించి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ రూ.6 కోట్లు ఇప్పటికే చెల్లింపులు చేసింది. మిగిలిన బిల్లులు కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించనుంది.

అనారోగ్యంతో జయలలిత ఆస్పత్రిలో చేరిన అనంతరం భద్రతా కారణాల రిత్యా రెండో అంతస్తు మొత్తం ఆమెకే కేటాయించారు. ఆ అంతస్తులోని 30 గదుల అద్దె కూడా బిల్లులో పేర్కొన్నారు. వీటికి రోజుకు కోటి రూపాయలని సమాచారం. ఇక ఎక్మో చికిత్స, లైఫ్‌ సపోర్టు యంత్రాల ఛార్జీలు, లండన్‌ వైద్య నిపుణుడు డాక్టర్‌ రిచర్డ్‌ బీలే తదితరాలు కూడా ఇంకా చెల్లించాల్సి ఉంది.