info@manadailynews.com
Breaking News

700 కుక్కలకు విషంపెట్టి చంపిన పాకిస్తాన్

dogs died pakistan

పాకిస్థాన్ లోని కరాచీ నగరంలో 700 వీధి కుక్కలను విషం పెట్టి చంపారు అక్కడి మున్సిపల్ అధికారులు. ఇవి చేసిన నేరం మనుషులని కరవడమే. మున్సిపల్ అధికారులు కరాచీతోపాటు ఆరు నగరాల్లో కుక్కలను చంపేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. చికెన్ ముక్కల్లో విషపు టాబ్లెట్లు కలిపి, వాటిని వీధి కుక్కలకు ఆహారంగా పెట్టి చంపడం పట్ల జంతు హక్కుల సంఘం ప్రతినిధులు విమర్శలు గుప్తిస్తున్నారు. స్థానిక మున్సిపల్ అథారిటీ అధికార ప్రతినిధి సత్తార్ జావేద్ చెప్పారు. కుక్కల పట్ల ఇంత దారుణమా అని ప్రశ్నిస్తున్నారు. కాగా కుక్కలు జనంపై దాడి చేసి కరుస్తుండటం వల్లనే తాము వాటిని చంపామని మున్సిపల్ అధికారి ముహమ్మద్ జాహీద్ చెప్పారు. గత ఏడాది కరాచీ నగరంలోనే కుక్కలు 6,500 మందికి కరిశాయని జిన్నా ఆసుపత్రి డాక్టరు సీమిన్ జమాలీ చెప్పారు. ఈ ఏడాది ఇప్పటికే 3,700 మంది ప్రజలు కుక్కకాటుతో చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చారని డాక్టర్ పేర్కొన్నారు. మొత్తం మీద విషం పెట్టి కుక్కలను చంపడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై ప్రపంచ వ్యాప్తంగా జంతు ప్రేమికులు ఎలా ప్రతిఘటిస్తారో చూడాలి.

mana-1 mana-2 mana-3 mana-4