info@manadailynews.com
Breaking News

12 రోజుల్లో.. 163 కోట్లు..!

nannaku prematho

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన మూవీ ‘నాన్నకు ప్రేమతో’. సంక్రాంతి కానుకగా వచ్చి బ్లాక్ బస్టర్ అయిన ఈ చిత్రం గురుంచి సరాసరి ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ ఎక్స్ పర్ట్ అయిన కైరా సాంధు సంచలమైన కామెంట్స్ చేసింది. ‘జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే ది బెస్ట్ చిత్రంగా నాన్నకు ప్రేమతో నిలిచిందని, ఈ సినిమా కేవలం 12 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 163 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసిన ఫెంటాస్టిక్ చిత్రం’ అంటూ ఆకసానికేతేసింది కైరా సాంధు. ఇక ఈ చిత్రం రిలీజ్ కు ముందు కూడా సాంధు దుబాయ్ నుంచి స్పందిస్తూ.. నాన్నకు ప్రేమతో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చెయ్యడం ఖాయం అని చెప్పింది. ఇక ఫ్యూచర్ లో ఈ సినిమా మరిన్ని వసూళ్లను రాబట్టడం ఖాయం అని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇప్పుడు కేవలం 12 రోజుల్లో 163 కోట్లు కొల్ల గొట్టిన విషయం తెలుసుకున్న అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.